NTV Telugu Site icon

Puri Jagannath: దేవుడా.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన పూరి.. అసలేమైంది.. ?

Puri

Puri

Puri Jagannath: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. హీరోలను పోకిరీలుగా చూపించే ఏకైక డైరెక్టర్ అంటే పూరినే. అంతేకాదు.. ప్రేక్షకులకు మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అసలు పూరి.. గోవా బీచ్ కు వెళ్లాడంటే కథ సిద్దమయ్యినట్టే.. కేవలం 40 రోజుల్లో సినిమా చేయాలంటే పూరి వలనే సాధ్యం. ఎన్నిసార్లు పడినా.. పైకి లేవడం ఆయన దగ్గరనుంచి నేర్చుకోవాలి. పడిన ప్రతిసారి పూరీ పని అయిపోయింది అనుకుంటారు. కానీ, అతను మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు నిలబడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్లాప్ లు అందుకున్న పూరి .. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఇక గతేడాది లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటకట్టుకున్నాడు. ప్లాప్ ను మాత్రమే కాదు కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూశాడు. దాన్నుంచి బయటపడడానికి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా.. డబుల్ ఇస్మార్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

VarunLuv: వరుణ్- లావణ్య పెళ్లి సందడి.. ఫొటోస్ వైరల్

ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా పూరి జగన్నాథ్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అసలు పూరి లుక్ మొత్తం మారిపోయింది. వయస్సు మళ్లినవాడిలా పూరి కనిపిస్తున్నాడు. గుండు చేయించుకొని.. ఇప్పడిప్పుడే వస్తున్న జుట్టు.. తెల్ల గడ్డం, ముఖంలో ముడతలు.. కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడు పూరిని ఇలా చూసింది లేదు. సడెన్ గా చూసి పూరిని గుర్తుపట్టడం కష్టమే అని చెప్పాలి. ఇక ఈ ఫోటోను ఛార్మీ షేర్ చేస్తూ “సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు” అంటూ క్యాప్షన్ ఇస్తూ.. డబుల్ ఇస్మార్ట్ అని ట్యాగ్ చేసింది. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ సమయంలో తీసిన పిక్ లా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసలు పూరి ఎందుకు ఇలా మారిపోయాడు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. మరి ఈ సినిమాతో పూరి మళ్లీ కమ్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Show comments