‘లైగర్’ టీమ్ షూటింగ్ హై యాక్షన్ షెడ్యూల్ కోసం యూఎస్ లో అడుగు పెట్టింది. ఏమాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేసేముందు దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ అద్భుతమైన లాస్ వెగాస్ నగరంలో చిల్ అయ్యారు. పూరి, విజయ్ కలిసి ఒక క్యాసినోలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నిర్మాత ఛార్మీ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించే ముందు అబ్బాయిలు వెగాస్‌లో చిల్ అవుతున్నారు” అని ఛార్మీ ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
Rea Also : టికెట్ రేట్లపై కోర్టుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం… అసలు విషయం ఇదే !
‘లైగర్” మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఈ చిత్రం యూఎస్ షెడ్యూల్‌లో ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ పాల్గొంటాడు. ఈ ఎపిసోడ్‌లు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని, షూటింగ్ జోరుగా సాగుతుందని సమాచారం. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.
