Site icon NTV Telugu

డ్రగ్స్ కేసు: పూరీ విచారణ పూర్తి.. మరోసారి పిలిచే అవకాశం?

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఈడీ విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 వరకు ఈ విచారణ కొనసాగింది. పూరీని, అతని సీఏను విడివిడిగా ప్రశ్నించారు. పూరీ బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా ఈడీ ఆరదీసింది. పూరీకి చెందిన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి సమాచారం సేకరించింది. 2015 నుంచి 2017 వరకు జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. దాదాపుగా 9 గంటల పాటు ఈ విచారణ జరిగింది. అయితే ఈరోజుతో పూరీ విచారణ ముగిసినట్లుగా కాదని తెలుస్తోంది. మరోసారి పూరీ విచారణకు హాజరైయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విచారణ సమయంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరైయ్యారు. కాగా, బండ్ల విచారణ విషయమై ప్రస్తావించగా.. కేవలం పూరీని కలవడానికే మాత్రమే వచ్చానని తెలియజేశారు.

Exit mobile version