దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’.. విజయ్ దేవరకొండకు జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా ఉండగా… పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా పూరి కనెక్ట్స్ లైగర్ అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘లైగర్’ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ దగ్గర పడుతుండటంతో విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
లైగర్ కొత్త షెడ్యూల్ చిత్రీకరణను వచ్చే వారం నుంచి గోవాలో ఆరంభించనున్నారు. నెల రోజులు పైగా సాగే ఈ షెడ్యూల్‌తో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.
