Puri Jagannadh Lavanya Love story: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పూరి జగన్నాథ్ లవ్ స్టోరీ గురించి గతంలో లావణ్య చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ సినీ దర్శకుడు కాకముందు దూరదర్శన్ లో ఒక సీరియల్ కి దర్శకత్వం చేసేవాడు. ఇందులో భాగంగా రెండు రోజుల షూటింగ్ కోసం పూరి జగన్నాథ్ రామంతపూర్ వెళ్ళాడట. అలా వెళ్ళిన తర్వాత ఓ ఇంటి ప్రాంగణంలో ఆ సీరియల్ షూటింగ్ చేస్తుండగా తొలిసారిగా పూరి జగన్నాథ్ లావణ్యని చూశాడని ఆమె చెప్పుకొచ్చారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఆమెను చూసిన తక్షణమే ఆమెపై మనసు పారేసుకున్నాడట.
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెన్సార్ రివ్యూ
ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని అక్కడే ఉన్న తన అసిస్టెంట్ ఒక అమ్మాయిని పిలిచి ‘ఆ మేడం వద్దకు వెళ్లి నా విజిటింగ్ కార్డు ఇవ్వు, అలానే ఆ మేడం అంటే నాకు బాగా ఇష్టం అని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పమని, ఇష్టమైతే విజిటింగ్ కార్డులోని ఫోనుకి కాల్ చేయమనని చెప్పి పంపాడట. కానీ లావణ్య ఈ మాటలు విని భయపడిపోయి విజిటింగ్ కార్డును తిరిగి పంపించిందట. అయినా మళ్లీ మళ్లీ పూరి జగన్నాథ్ తన విజిటింగ్ కార్డు ఆమెకు పంపించగా అక్కడి నుంచి వెళ్లిపోయిందట. అయితే వారం ఆగి మరోసారి అదే అసిస్టెంట్ ను తీసుకుని వచ్చాడని, ఈసారి కనుక మీ ఉద్దేశం చెప్పక పోతే తన తల్లితండ్రులను పెళ్లి గురించి పంపుతానని చెప్పడంతో లావణ్య పూరి జగన్నాథ్ ఇచ్చిన విస్టింగ్ కార్డు నెంబర్ కి ఫోన్ చేసిందట. అయితే ఆ ఫోను నెంబరు పూరి అద్దెకుంటున్న ఇంటి ఓనర్ దని తరువాత ఒక చోట కలిశామని ఆమె చెప్పుకొచ్చింది.
అలా కలిసినప్పుడు ఐదు నిమిషాలు మాట్లాడతానని చెప్పి గంటన్నరలో తన చిన్ననాటి నుంచి అప్పటి వరకు ఉన్న సంగతులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆస్తి పాస్తుల వివరాలు చెప్పాడట. ఆ తర్వాత తన ఇంటి అడ్రస్ ఉన్న కవర్ ఇచ్చిన నీకు నచ్చిన విషయం మా ఇంటికి పోస్ట్ చేయి నేను మాట్లాడుకుంటానని చెప్పాడట. అలా చెప్పడంతో తాను ఫిదా అయ్యానని లావణ్య చెప్పుకొచ్చింది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసిందని చెప్పుకొచ్చింది. ఇక తమ ప్రేమ కొనసాగుతున్నప్పుడు జరిగిన సంఘటనలను తన దర్శకత్వం వహించిన సినిమాలలో పూరి జగన్నాథ్ చూపించాడని ఇడియట్ లో కూడా కొన్ని సీన్స్ పెట్టారని లావణ్య చెప్పుకొచ్చారు.