Site icon NTV Telugu

Puri Jagannadh: పూరి పచ్చి మోసగాడు.. అతని పరువు తీయాల్సిందే

Puri

Puri

Puri Jagannadh: డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైగర్ సినిమా ప్లాప్ కావడంతో డబ్బుల కోసం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పూరి ఇంటికి వెళ్లి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, శోభన్ పూరి పరువు ఎలాగైనా తీద్దామని ప్లాన్ వేసుకొని మిగతా వారిని రెచ్చగొడుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయమై పూరి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీకి భారీ భారీ హిట్లు ఇచ్చిన ఒక డైరెక్టర్ కు డైరెక్ట్ గా బెదిరింపులు వచ్చినా ఇండస్ట్రీ కానీ, హిట్ అందుకున్న హీరోలు కానీ ఇప్పటివరకు నోరు మెదపకపోవడం శోచనీయం. ఇక పూరికి ఎవరు ఉన్నా లేకున్నా మేము అండగా ఉంటాం అంటున్నారు పూరి అభిమానులు. ఈ ఘటన జరిగిన దగ్గరనుంచి అభిమానులు పూరికి సపోర్ట్ గా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఒక అభిమాని పూరిని సపోర్ట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకొంటుంది.

పూరి అభిమాని ఒకరు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు . “అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి. అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాల అంటూ చెడుగుడు ఆడాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version