Site icon NTV Telugu

Punith RajKumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం

punith-rajkumar

punith-rajkumar

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంత మరో విషాదం నెలకొంది. ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందడంతో తీవ్ర విషాదంలో నెలకొన్న ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ ఫిబ్రవరి 20న గుండెపోటుతో మృతిచెందారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఆదివారం ఉదయం ఆయన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక దీంతో మరోసారి పునీత్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ కుటుంబానికి దేవుడు తోడు ఉండాలని కోరుకుంటున్నామని అభిమానులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version