Site icon NTV Telugu

అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు

puneeth

puneeth

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పునీత్ అంత్యక్రియల విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్ రాజ్ కుమార్‌తో పునీత్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పునీత్‌కు ఇద్దరు కూతుళ్లే కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు కుటుంబ సభ్యులు.

Read Also : జైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్

పునీత్ చిక్కమగళూరుకు చెందిన అశ్విని రేవంత్‌ని 1999లో డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత. ఆయన పెద్ద కూతురు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. ఈరోజు సాయంత్రము 5 గంటలకు ఆమె బెంగుళూరుకు చేరుకోనున్నారు. అనంతరం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు స్టార్ట్ అవుతాయి. కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల మధ్య లో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. నటుడి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

Exit mobile version