Punch Prasad: పంచ్ ప్రసాద్ ఆపరేషన్ సఫలం… థాంక్యూ సీఎం జగన్ అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punch Prasad Operation Sucessful: ఈ టీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నా ఎందుకో తగిన గుర్తింపు అయితే దక్కలేదు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేకున్నా మిత్రుల సహాయంతో బుల్లితెర షోలలో కనిపిస్తూ ఆ వచ్చిన డబ్బులు వైద్యానికి ఉపయోగిస్తూ వస్తున్నాడు. ఖరీదైన వైద్యం కావడంతో తన సంపాదన సరిపోవడం లేక పంచ్ ప్రసాద్ చికిత్స కోసం విరాళాలు కూడా సోషల్ మీడియా వేదికగా అడిగారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం చేయగా పలువురు ఇతరులు కూడా సాయం చేశారు.
Sound Party: సౌండ్ పార్టీ గట్టిగానే సౌండ్ చేస్తోందే!
Also Read
ఇక ఆ మధ్య పంచ్ ప్రసాద్ కి తన కిడ్నీ ఇచ్చేందుకు భార్య సిద్ధం కాగా వైద్యులు వద్దని సూచించారు. డోనర్ దొరికిన నేపథ్యంలో మీరు కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నా ట్రాన్స్ప్లాంటేషన్ లేట్ అయింది. ఇక ఎట్టకేలకు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ఏపీ ప్రభుత్వం సహకారం అందించిందని ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు. పంచ్ ప్రసాద్ వైద్యానికి అయిన ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి రోజా పంచ్ ప్రసాద్ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి సీఎంఆర్ఎఫ్ తరపున పంచ్ ప్రసాద్ కి వైద్యం అందించినట్టు తెలుస్తోంది. ఇక విజయవంతంగా ఆపరేషన్ జరగడంతో పంచ్ ప్రసాద్ సీఎం జగన్, మంత్రి రోజాలతో పాటు మిత్రులు, అభిమానులకు వీడియో ద్వారా ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!