Bhagavanth Kesari: బాలయ్య సౌండ్ సరిపోవట్లేదు… కాస్త బేస్ పెంచండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, వినాయక చవితి స్పెషల్ సాంగ్ తో ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. అయితే టీజర్ లో నెలకొండ భగవంత్ కేసరి… అడవి బిడ్డా అని బాలయ్య డైలాగ్ హైప్ పెంచింది. ఈ హైప్ ని మ్యాచ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ అనిల్ రావిపూడి నుంచి ఇంకా బయటకి రాలేదు. ఆ టీజర్ ఇచ్చిన జోష్ ని చిత్ర యూనిట్ కంటిన్యు చెయ్యడంలో కాస్త వెనుకబడ్డారు..
‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ కి ఇంకో మూడు వారాల సమయం మాత్రమే ఉంది, మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ జోష్ ని కంటిన్యు చేస్తూ ఒక మాస్ సాంగ్ ని దించితే భగవంత్ కేసరి సినిమా బజ్ సాలిడ్ స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ కి మిస్ చేస్తున్న చిత్ర యూనిట్, ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు భగవంత్ కేసరి సినిమాకి పోటీగా వస్తున్న లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో భగవంత్ కేసరి ప్రమోషన్స్ స్లో అయితే ఆడియన్స్ దృష్టి ఇతర సినిమాలపైకి వెళ్లే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి అండ్ టీం ఈ జాగ్రత్త తీసుకోని ఇకపై అయినా ‘భగవంత్ కేసరి’ నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ లో ఇప్పటికే ఉన్న హైప్, రిలీజ్ డేట్ వరకూ క్యారీ ఫార్వడ్ అవుతుంది.
Also Read
- Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
- Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
- Varanasi : 'వారణాసి'కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
- Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో 'చార్మినార్'.. 'ఫౌజీ'కి భారీ సెటప్ రెడీ!
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
-
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
-
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!