సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, వినాయక చవితి స్పెషల్ సాంగ్ తో ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. అయితే టీజర్ లో నెలకొండ భగవంత్ కేసరి… అడవి బిడ్డా అని బాలయ్య డైలాగ్ హైప్ పెంచింది. ఈ హైప్ ని మ్యాచ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ అనిల్ రావిపూడి నుంచి ఇంకా బయటకి రాలేదు. ఆ టీజర్ ఇచ్చిన జోష్ ని చిత్ర యూనిట్ కంటిన్యు చెయ్యడంలో కాస్త వెనుకబడ్డారు..
‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ కి ఇంకో మూడు వారాల సమయం మాత్రమే ఉంది, మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ జోష్ ని కంటిన్యు చేస్తూ ఒక మాస్ సాంగ్ ని దించితే భగవంత్ కేసరి సినిమా బజ్ సాలిడ్ స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ కి మిస్ చేస్తున్న చిత్ర యూనిట్, ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు భగవంత్ కేసరి సినిమాకి పోటీగా వస్తున్న లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో భగవంత్ కేసరి ప్రమోషన్స్ స్లో అయితే ఆడియన్స్ దృష్టి ఇతర సినిమాలపైకి వెళ్లే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి అండ్ టీం ఈ జాగ్రత్త తీసుకోని ఇకపై అయినా ‘భగవంత్ కేసరి’ నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ లో ఇప్పటికే ఉన్న హైప్, రిలీజ్ డేట్ వరకూ క్యారీ ఫార్వడ్ అవుతుంది.