NTV Telugu Site icon

Project K: ఇండియన్ సినిమా చూడబోతున్న అద్భుతం…

Kamal Hassan In Project F

Kamal Hassan In Project F

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ దే హైయెస్ట్ బడ్జెట్‌ అని తెలుస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్‌ దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది కానీ ప్రాజెక్ట్ K బడ్జెట్ అంతకుమించి అనేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ప్రాజెక్ట్ కెలో జాయిన్ అవ్వడంతో బడ్జట్ లెక్క మారిందని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రాజెక్ట్ K పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే బడ్జెట్ లెక్కలు కూడా మారిపోయినట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమా బడ్జెట్ 500 నుంచి 550 కోట్ల రేంజ్‌లో అనుకున్నారు కానీ కమల్ హాసన్ రాకతో.. బడ్జెట్ లెక్క 600 కోట్లకు పైగానే పెరిగిందని అంటున్నారు.

ప్రభాస్‌కు 150 కోట్లు ఇస్తుండగా.. కమల్ హాసన్ కూడా వంద కోట్ల వరకు అందుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కమల్ హాసన్‌ పారితోషికం 20 కోట్లని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కమల్ నాలుగు వారలు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్లు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ 10 కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నట్టు టాక్. కీలక టెక్నీషియన్స్‌ కూడా ఒక్కొక్కరు 10 కోట్ల వరకు తీసుకుంటున్నారట. మొత్తంగా కేవలం ప్రాజెక్ట్ K రెమ్యునరేషన్స్‌కే దాదాపు 200 కోట్ల వరకు ఖర్చవుతోందట. ఇక సినిమా మేకింగ్ కోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రభాస్ కెరీర్లో 600 కోట్ల అత్యధిక బడ్జెట్‌తో వస్తున్న సినిమాగా ప్రాజెక్ట్ K నిలవబోతోంది. ఇప్పటివరకు దాదాపుగా 80% షూటింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే సంక్రాంతికి జనవరి 12న ప్రాజెక్ట్ కె రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి అంచనాలు పెంచేస్తున్న ప్రాజెక్ట్ కె ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.