NTV Telugu Site icon

Project K: ప్రభాస్ సినిమా యూనిట్ లో విషాదం, మరణించిన ప్రొడక్షన్ డిజైనర్

Project K Sunil Babu

Project K Sunil Babu

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ చిత్ర యూనిట్ లో విషాదం నెలకొంది. ఈ భారి ప్రాజెక్ట్ కి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న ‘సునీల్ బాబు’ హార్ట్ ఎటాక్ తో మరణించారు. బెంగుళూరు డేస్, గజినీ, వారిసు లాంటి సినిమాలకి ఆర్ట్ వర్క్ చేసిన మలయాళ అర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు 50 ఏళ్ల వయసులో కేరళలోని ఎర్నాకులంలో చనిపోయారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా, మహేశ్ బాబు నటించిన మహర్షీ సినిమాలకి కూడా సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో బెంచ్ మార్క్ సినిమాలకి ప్రొడక్షన్ ని డిజైన్ చేసిన సునీల్ బాబు చనిపోవడంతో కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో ఆయనతో వర్క్ చేసిన వాళ్లు కూడా దిగ్బ్రాంతికి లోనయ్యారు. చనిపోయే ముందు వరకూ పని చేస్తూనే ఉన్న సునీల్ బాబు, రీసెంట్ గా కూడా ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాంటి వ్యక్తి సడన్ గా చనిపోవడంతో సునీల్ బాబుకి నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ K సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న వైజయంతి మూవీస్ కూడా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో సునీల్ బాబుకి నివాళి అర్పిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుని గెలుచుకున్న సునీల్ బాబు చనిపోవడం కేరళ ఫిల్మ్ ఫెటర్నిటీకి తీరని లోటు అనే చెప్పాలి.

Show comments