Site icon NTV Telugu

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం బడా నిర్మాణ సంస్థల పోటీ..

Sindoor

Sindoor

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా గర్వాన్ని నింపుతోంది. ఈ పేరు వింటేనే ఇప్పుడు దేశమంతా సెల్యూట్ చేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రమూకలు హతం అయిపోయారు. పాక్ లోపలకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులపై మిసైల్స్ వర్షం కురిపించారు. 25 నిముషాల్లో ఆపరేషన్ ముగించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది మన ఆర్మీ. దీంతో ఆపరేషన్ సిందూర్ పేరు ఓ బ్రాండ్ అయిపోయింది. ఈ పేరు కోసమే ఇప్పుడు బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి.

Read Also : Operation Sindoor : మోస్ట్ వాంటెడ్‌.. జైషే ఉగ్రవాది మసూద్ అజార్ సోదరుడు హతం
టీ సిరీస్‌, జీ స్టూడియోస్‌ వంటి బడా నిర్మాణ సంస్థలూ ఈ టైటిల్ కోసం అప్లై చేసుకున్నాయి. ఈ పేరుకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండటంతో దీన్ని తమ సినిమాలకు పెట్టుకునేందుకు వీరంతా పోటీ పడ్డారు. దీనిపై దరఖాస్తు దారుల్లో ఒకరైన అకోశ్ పండిత్ మాట్లాడుతూ.. ఈ టాపిక్ మీద సినిమాలు వస్తాయా లేదా అన్నది తెలియదు. కానీ ఈ టైటిల్ కోసం ఇప్పటి నుంచే అంతా పోటీ పడుతున్నారు. భవిష్యత్ లో ఇప్పుడు అప్లై చేసుకున్న వారంతా సినిమాలు చేస్తారనే గ్యారెంటీ లేదు. కానీ ఆ టైటిల్ కు ఉన్న గుర్తింపు కోసం అందరూ ఆరాటపడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : Ameer Khan : ‘మహాభారతం’లో కృష్ణుడి పాత్ర చేస్తా.. అమీర్ ఖాన్ క్లారిటీ..

Exit mobile version