‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో నేషనల్ లెవల్ లో క్రేజీ హాట్ బ్యూటీగా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ఒక్కే ఒక్క పాటతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్నా అయిన, తనకు మించిన ఫేమ్‌ని త్రిప్తి అందుకుంది. ఒక్క రోజులోనే తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ మిలియన్స్ లో పెరిగిపోయారు. అంతేకాదు రీసెంట్‌గా బాలీవుడ్‌లో తన తోటి హీరోయిన్లందరిని దాటుకుని గూగుల్ సెర్చ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది త్రిప్తి. ఇంత క్రేజ్ ఉన్న ఈ హాట్ బ్యూటీ ని ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పించరట నిర్మాతలు.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో ‘ఆషీకీ – 2’ మూవీకి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. శ్రద్ధ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా మూడో భాగం కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ, త్రిప్తిని సెలక్ట్ చేశారు. కానీ తాజా సమాచారం మేకర్స్ ఇప్పుడు ఆమెను తప్పిచారని బాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. అయితే మేకర్స్ అనుకున్నంత రేంజ్ లో పెర్ఫామ్ చేయడం లేదని, బాగా ఎమోషనల్ గా నటించే హీరోయిన్ అయితే బాగుంటుంది అని, ఆమె ఆ రోల్ కి సూట్ కావడం లేదని పక్కన పెట్టేశారట. దీంతో మరో కొత్త హీరోయిన్ కోసం మేకర్స్ చూస్తున్నారట. పాపం త్రిప్తి మొత్తానికి ఒక క్రేజీ లవ్ సీక్వెల్ మిస్ చేసుకుంది.