NTV Telugu Site icon

Producers Council Elections: రసవత్తరంగా నిర్మాతల మండలి ఎన్నికలు

Tfpc

Tfpc

Producers Council Elections:తెలుగు చలనచిత్రనిర్మాతల మండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇటీవల నిర్మాణవ్యయం తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ బంద్ ని అందరూ కలసి తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని భావించినప్పటికీ సి. కళ్యాణ్ ఆధ్వర్యంలోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ కి దిల్ రాజు అండ్ కో ఆధ్వర్యంలోని ప్రోగ్రసీవ్ ప్రొడ్యూసర్స్ పానెల్ కి మధ్య ముఖ్యమైన పదవులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మధ్య పోటీ తప్పనిసరి అయింది. ఉపాధ్యక్ష పదవులకు అశోక్ కుమార్ తోపాటు సుప్రియ, కోశాధికారి పదవికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపిక కాగా మిగిలిన పదవులకు వచ్చే ఆదివారం అంటే 19న ఎన్నికలు జరగనున్నాయి.

నిర్మాతల మండలి ప్యానెల్ నుంచి అధ్యక్షపదవికి జెమినీ కిరణ్, కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవియస్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా వి.అశోక్ కుమార్, సి.హెచ్.వి.యస్,ఎన్.వి బాబ్జీ, బి. బాపిరాజు, గోపీనాధ్ ఆచంట, పల్లి కేశవరావు, పూసల కిశోర్, పద్మాలయా నరసింహారావు, నయీమ్ అహ్మద్, ప్రతాని రామకృష్ణగౌడ్, వై. రవీందర్ బాబు, జి. శంకర్, కె. వెంకటరమణారెడ్డి, వజ్జా శ్రీనివాసరావు పోటీ పడుతుండగా ప్రోగ్రెసీవ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుంచి అధ్యడుగా కె.ఎల్. దామోదరప్రసాద్, కార్యదర్శులుగా జె.వి.మోహన్ గౌడ్, మోహన్ వడ్లపట్ల, ఉపకార్యదర్శులుగా సి. భరత్ చౌదరి, ఎ. గురురాజ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా అభిషేక్ అగర్వాల్, డి.వి.వి. దానయ్య, తోట కృష్ణ, బి. మధుసూధన్ రెడ్డి, ఎన్. పద్మిని, రాహుల్ యాదవ్ నక్కా, రామకృష్ణ గారపాటి, రవికిశోర్, రవీంద్రగోపాల, యలమంచి రవిశంకర్, సాయిరాజేశ్ నీలం, వై. సురేందర్ రెడ్డి, వి. వెంకటరమణారడ్డి (దిల్ రాజు), వేణుగోపాల్ బి, విజయ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఉపకార్యదర్శి పదవులకు సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి పోటీ లేనప్పటికీ నట్టికుమార్ ఇండిపెండెంట్ గా పోటీ పడుతుండటంతో అతనికి సహకారం అందిస్తున్నట్లు వినికిడి. మరి ఈ రెండు ప్యానెల్స్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.