NTV Telugu Site icon

Prabhas: సుకుమార్ తో ప్రభాస్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్…

Sukumar Prabhas

Sukumar Prabhas

ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ అయిన సుకుమార్, ప్రభాస్ లా కాంబినేషన్ ని సెట్ చేసింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అంటూ చాలామంది ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే ఒక డిఫరెంట్ సినిమాని చూడొచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ నిజంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా అంటే? నో అనే చెప్పాలి. సుకుమార్, ప్రభాస్ ల సినిమా విషయంలో స్ప్రెడ్ అవుతున్న రూమర్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ‘ప్రతి ప్రాజెక్ట్ వివరాలని టైం వచ్చినప్పుడు అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తాము, అప్పటివరకూ ఎలాంటి రూమర్స్ ని నమ్మకండి’ అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పోస్ట్ చేశారు.

Read Also: Prabhas: ఇది కదా అసలైన మాస్ కటౌట్…

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అఫీషియల్ గానే లేదని చెప్పడంతో సుకుమార్, ప్రభాస్ లు సినిమా చేస్తున్నారు అనే వార్తకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడంలో బిజీగా ఉన్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ‘వ్యాక్సిన్ వార్’ అనే సినిమాని చేస్తున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే సలార్, ప్రాజెక్ట్ K, ఆది పురుష్, స్పిరిట్, దర్శకుడు మారుతీతో ఒక సినిమా… ఇలా భారి పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ గ్యాప్ లేకుండా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో సుకుమార్ తో కలిసి ప్రభాస్ సినిమా చెయ్యడం అనేది కష్టమైన పనే. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు కానీ ప్రభాస్-సుకుమార్ కలిసి ఎప్పుడు సినిమా చేసినా అదో సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది.

Read Also: Salaar: ఈ యాక్షన్ ఎపిక్ అనౌన్స్ అయ్యి రెండేళ్లు…

Show comments