Site icon NTV Telugu

Raja saab : రాజాసాబ్ రిలీజ్ డేట్ చెప్పేసిన నిర్మాత విశ్వప్రసాద్..

Raajasaab

Raajasaab

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన  వచ్చింది.

Also Read : Box office results : అనుకున్నదే జరిగింది.. కూలీ, వార్ 2 ని వెనక్కి నెట్టిన రీజనల్ సినిమా

కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్దీ రోజులగా రోజుకొక డేట్ ఫినిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా అయితే రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. ఈ వార్తలన్నిటికి నిర్మాత విశ్వప్రసాద్ ఒక్కమాటతో ఫుల్ స్టాప్ పెట్టేసారు. తాజాగా హైదరాబాద్ లో ప్రసాద్ మల్టిప్లెక్స్ లో జరిగిన మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ’ రాజాసాబ్ జనవరి 9 న సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5 న విడుదల కావాల్సిఉంది. కానీ షూటింగ్స్ బంద్ తో పాటు ఇతర కారణాల వలన డిసెంబరు నుండి తప్పుకుని సంక్రాంతి రేస్ లో నిలిచింది. కాగా ఈ సినిమాలోని సాంగ్స్ షూట్ పెండింగ్ ఉంది.  VFX విషయంలో  ఎక్కడ కంప్రమైజ్ కాకుండా హై క్వాలితో తెరకెక్కిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. రాజాసాబ్ సంక్రాంతి రాకతో ఈ సారి సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతుంది.

Exit mobile version