సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సుధాకర్ చెరుకూరి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి డీసెంట్ బజ్ ఉంది. దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దిశగా కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన, పారడైజ్ సినిమాకి సంగీతం అందిస్తున్న అనిరుధ్ గురించి మాట్లాడారు. అనిరుధ్ ఆలస్యంగా ట్యూన్స్ ఇవ్వడం కరెక్టే కానీ, ఆ ఆలస్యానికి తగ్గట్టు అద్భుతమైన ట్యూన్స్ ఇస్తాడని చెప్పుకొచ్చారు. తమకు ఒక సాంగ్ ఇవ్వడానికి చాలా రోజుల సమయం తీసుకున్నాడని, కానీ ఆ సాంగ్ అవుట్ ఫుట్ వచ్చాక మాత్రం అదిరిపోయిందని అన్నారు.
Also Read :Chiranjeevi : రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చిరంజీవి -ఓదెల సినిమా!
కాబట్టి ఆలస్యమైనా ది బెస్ట్ అనిరుధ్ ఇస్తాడంటూ ఆయన అనిరుధ్‌కి కితాబిచ్చారు. ఒకవేళ అనిరుధ్ వల్ల ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే, అలాంటి పరిస్థితి అయితే ఉండదని, ఎందుకంటే ముందుగానే మ్యూజిక్ అవుట్ ఫుట్ తీసుకుంటామని చెప్పారు. తమ సినిమా వర్షాలు ,కార్మికుల సమ్మె వంటి విషయాల వలన ఆలస్యం అయిందని, మ్యూజిక్ వల్ల సినిమాలు ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. నాని హీరోగా రూపొందుతున్న ‘పారడైజ్’ సినిమాని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని నాని కెరియర్ లోనే పూర్తిస్థాయి రస్టిక్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు.