Site icon NTV Telugu

Mohan Mullapudi: టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా టాలీవుడ్ నిర్మాత..

Ttd

Ttd

Mohan Mullapudi: టాలీవుడ్ నిర్మాత మోహన్ ముళ్ళపూడి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు, జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా మోహన్ ముళ్ళపూడి నియమితులయ్యారు.

Tasty Teja: బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేశావా తేజ..

మోహన్ ముళ్ళపూడి గతంలో పలు సినిమాలకు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు(FNCC) హానరబుల్ సెక్రెటరీ గా వ్యవహరిస్తూనే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్‌ లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధి లో మరియు కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులలో లోకల్ అడ్వైజరి కమిటీ మెంబర్ గా చేపట్టిన బాధ్యతలను నిర్వహిస్తారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version