Site icon NTV Telugu

SKN Trolled Dil Raju: దిల్‌రాజుని వేదికపై ట్రోల్ చేసిన ఎస్కేఎన్.. భలే ఇరుక్కు

Skn Trolled Dil Raju

Skn Trolled Dil Raju

Producer SKN Trolled Dil Raju In Writer Padmabhushan Trailer Launch Event: ‘వారిసు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు మాట్లాడిన తమిళ భాషపై ఎంత ట్రోలింగ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే! తనకు తమిళం రాకపోయినా.. అక్కడి ఆడియెన్స్‌ని, విజయ్ అభిమానుల్ని ఆకట్టుకోవడం కోసం తమిళంలో మాట్లాడేందుకు దిల్‌రాజు ప్రయత్నించాడు. డ్యాన్స్ వేనుమ డ్యాన్స్ ఇరుక్కు (మీకు డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ ఉంది), ఫైట్ వేనుమ ఫైట్ ఇరుక్కు (ఫైట్స్ కావాలంటే ఫైట్స్ ఉన్నాయి) అంటూ.. తాను ప్రిపేర్ అయిన తమిళ భాషలో ఆయన మాట్లాడాడు. అయితే.. ట్రోలర్స్‌కి అది ఫన్నీ కంటెంట్‌గా మారిపోయింది. ఇలాంటి అవకాశాల కోసం వేచి చూసేవాళ్లకు.. దిల్‌రాజు తమిళం చాలా సరదాగా అనిపించడంతో, అంతే ఫన్నీగా ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఒక నెటిజన్ అయితే.. దానికి మాంచి బీట్ జోడించి, ఒక ట్రోలింగ్ సాంగ్‌ని సిద్ధం చేశాడు.

Neeta Pawar Missing: కన్నడ నటుడి సోదరి మిస్సింగ్.. మూడు రోజులైనా..

ఇలా ఎవరికి వారు తమ ట్యాలెంట్‌ని జోడిస్తూ.. దిల్‌రాజు తమిళంని బాగా వాడేసుకుంటున్నారు. మొన్న ఆమధ్య వారిసు సినిమా చూసిన తర్వాత ఓ యువతి సైతం దిల్‌రాజు శైలిలోనే తన రివ్యూ ఇచ్చి హైలైట్ అయ్యింది. ఇప్పుడు నిర్మాత ఎస్కేఎన్ సైతం దిల్‌రాజుని ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘రైటర్ పద్మభూషణ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసిన ఆయన.. తన స్పీచ్ చివర్లో ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు, ఫైట్స ఇరిక్కు, స్టోరీ ఇరిక్కు అంటూ దిల్‌రాజుని ఇమిటేట్ చేశాడు. ఎస్కేఎన్ కామెడీ ఇరిక్కు అనడమే ఆలస్యం.. ఆ వేదిక మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. వేదికపై ఉన్న వాళ్లు సైతం తమ నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనూ అంతే నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. మీరూ ఓసారి చూసి.. ఎంజాయ్ చేయండి.

Guinnis Record: ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్.. గిన్నిస్ రికార్డుల్లో చోటు

Exit mobile version