Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సందర్భంగా మూవీపై అనేక రకాల అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు. రెండు పార్టీలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంతో చాలా సీన్లను తీసేస్తారని ముందు నుంచే తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీలో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి ఒక సినిమా తీస్తే ఎక్కువగా వేస్టేజ్ ఉండదు. ఏది తీయాలి అనుకున్నారు కరెక్ట్ గా అదే సీన్ షూట్ చేస్తారు. అంతేతప్ప ఎక్స్ ట్రా మెటీరియల్ ఏమీ ఉండదు.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్.. తీసేసిన సీన్లు ఇవే.. ఫ్యాన్స్ కు షాక్
బాహుబలి రెండు పాటలు తీసినప్పుడు కూడా ఎక్కువ సీన్లు ఏవి మిగిలిపోలేదు. కాబట్టి ఫ్యాన్స్ దీనిమీద పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దు. అలా అంచనాలు పెట్టుకుని మూవీకి వెళ్తే నిరాశకు గురవుతారు. కాకపోతే చిన్నాచితక సీన్స్ ఒకటి రెండు సినిమాలో యాడ్ అవుతున్నాయి. చాలావరకు మొదటి పార్టులోనీ సీన్స్ ను రెండో పార్ట్ లోని సీన్స్ కు లింకు చేస్తూ బాహుబలి ది ఎపిక్ సినిమాలు రాజమౌళి తీర్చిదిద్దాడు. కాబట్టి ఇందులో కొత్తగా పెద్దపెద్ద సీన్లు ఏవి ఆడ్ చేయలేదు అంటూ శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చారు.
Read Also : Mass Jathara: ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ‘మాస్ జాతర’
