Samantha: సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరి- హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సామ్ చాలా కష్టపడిందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ “సమంత నా పెద్ద కూతురు లాంటింది. గతేడాదిలో ఆమెకు కథ చెప్పాం. 40 నిమిషాల్లోనే ఆమె ఈ కథ ఓకే చేసింది. సినిమా చేయడానికి అంగీకరించింది. సినిమాకు సంబంధించిన ప్రతి బాధ్యత ఆమె తీసుకొంది. ఇక ఆమె వ్యాధి గురించి సోషల్ మీడియాలో ఆమె చెప్పాకే అందరికి తెల్సింది. అప్పటికే తెలుగు, తమిళ్ లో సగానికి పైగా డబ్బింగ్ చెప్పేసింది. ఇక తమిళ్ లో మిగిలిన డబ్బింగ్ చెప్పినప్పుడే ఆమె ఎంతో ఇబ్బంది పడింది. డాక్టర్ పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. ఇక, హిందీ వెర్షన్‌కు గాయని చిన్మయితో డబ్ చెప్పించాం” అని చెప్పుకొచ్చారు,. ఏదిఏమైనా సినిమా కోసం సామ్ డెడికేషన్ మాములుగా లేదని నెటిజన్లు అభినందిస్తున్నారు.