Shayaji Shinde: టాలీవుడ్ స్టార్ విలన్స్ లో షాయాజీ షిండే ఒకరు. విలన్ గానే కాకుండా మంచి సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పిస్తున్న షాయాజీ వివాదంలో చిక్కుకున్నాడు.భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ విలన్ ఇటీవల ఒక మరాఠీ సినిమాను ఒప్పుకున్నాడట. ఇక ఆ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న షిండే.. షూటింగ్ కి వస్తానని నమ్మకంగా చెప్పి డేట్స్ ఇచ్చిన సమయంలో మాత్రం షూటింగ్ కు హాజరుకాలేదట. దీంతో సదురు నిర్మాత భారీగా నష్టపోయాడట.
కాగా, షూటింగ్ ఎందుకు రాలేదు అని షిండేను అడిగితే సమాధానం చెప్పలేదని, కథ చెప్పేటప్పుడు కొన్ని మార్పులు చేయమన్నాడని, తాము చేయము అనేసరికి సెట్ లోనే అందరిముందు గొడవపడ్డాడని నిర్మాత చెప్పుకొచ్చాడు. అయితే తన కారణంగా సెట్ లో ఆ రోజు షూటింగ్ ఆగిపోయిందని ఆ కారణంగా తాను రూ. 17 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. దీంతో తనకు నష్టపరిహారం షిండే చెల్లించాలని కోరుతూ సదరు నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. ఈ నష్టం మొత్తం తనకు తిరిగి ఇప్పించాలని పోలీసులతో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్ లోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి ఈ వివాదంపై షాయాజీ షిండే ఎలా స్పందిస్తాడో చూడాలి.