Site icon NTV Telugu

RGV : బర్త్ డే రోజు షాకిచ్చిన కోర్ట్… వర్మపై నిర్మాత కేసు

Rgv

Rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు కూడా వివాదం తప్పలేదు. వర్మకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే ఓ నిర్మాత మాత్రం షాక్ ఇచ్చాడు. ఏకంగా బర్త్ డే బాయ్ పై కేసు వేసి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆర్జీవీ తాజా చిత్రం “మా ఇష్టం” మూవీని ఆపాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడ నిర్మాత నట్టి కుమార్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను వర్మ తుంగలో తొక్కినట్టు నట్టి కుమార్ ఆరోపించారు. దీంతో ఆర్జీవీ తీసిన “మా ఇష్టం” సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Rashmika : విజయ్ పై క్రష్… శ్రీవల్లి పోస్ట్ వైరల్

కాగా వర్మ ఇప్పుడు “డేంజరస్” అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమవుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. నైనా గంగూలీ, అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. సినిమాకు తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తున్న వర్మకు కోర్ట్ ఇలా షాక్ ఇచ్చింది. మరి సినిమా విడుదల అవుతుందా? ఆగుతుందా ? అన్నది వేచి చూడాల్సిందే !

Exit mobile version