‘డిజె టిల్లు’ విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ లో తను ప్రేక్షకులను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించటం… దానిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఆడియన్స్ కు క్షమాపణలు తెలియచేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజెటిల్లు విడుదలైన రోజు నేను మాట్లాడిన మాటలు వారికి ఇబ్బంది కలిగించాయన్న వార్త తెలిసి బాధపడ్డాను. వారిని నా సోదరసమానులుగా భావించటం వల్లే అలా ఏకవచనంతో సంబోధించాను. అయినా వారి మనసు నొచ్చుకోవటం పట్ల క్షంతవ్యుడిని. వారంటే మాకు గౌరవం, వారే మా బలం’ అని చెప్పారు. మరి వంశీ క్షమాపణతో ఆడియన్స్ సంతృప్తి చెందుతారేమో చూడాలి.
NagaVamsi: ప్రేక్షకులకు నాగవంశీ క్షమాపణలు

naga vamsi