NTV Telugu Site icon

Naga Vamsi: ఈ యంగ్ ప్రొడ్యూసర్ ‘సింహం’తో సినిమా చేస్తున్నాడా?

Naga Vamsi

Naga Vamsi

యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హ్యూజ్ హైప్ ఉంది. నాగ చైతన్య, నితిన్, నాని, నాగ శౌర్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో సినిమాలని ప్రొడ్యూస్ చేసిన నాగ వంశీ సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే ధనుష్ తో కూడా సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టిన నాగ వంశీ, నెక్స్ట్ మూవీ దుల్కర్ సల్మాన్ తో అనౌన్స్ చేసాడు. రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్, కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చెయ్యడం నాగ వంశీ స్టైల్. లేటెస్ట్ గా నాగ వంశీ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో కొత్త డిస్కషన్ కి తెరలేపింది. జూన్ 10 అని ట్వీట్ చేసిన నాగ వంశీ, పక్కన సింహం బొమ్మ కూడా పెట్టాడు. దీనితో నాగ వంశీ ఏ సినిమా గురించి చెప్తున్నాడా అనే చర్చ సినీ అభిమానుల్లో మొదలయ్యింది. గుంటూరు కారం గురించి ఏమో అనుకోని మహేష్ ఫాన్స్ నాగ వంశీ ట్వీట్ ని చూసి ఆలోచనలో పడ్డారు కానీ అసలు విషయం మహేష్ సినిమా గురించి కాదు.

సింహం బొమ్మ చూస్తేనే అర్ధం చేసుకోవాలి కదా టాలీవుడ్ లో సింహం ఒకరికే సొంతమని అంటూ నందమూరి ఫాన్స్ లైమ్ లైట్ లోకి వచ్చేసారు. నాగ వంశీ జూన్ 10న బాలయ్యతో చెయ్యబోయే సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్నాడు. జూన్ 10న బాలయ్య బర్త్ డే కాబట్టి నాగ వంశీ చేసిన ట్వీట్ దాదాపు బాలయ్య సినిమా గురించే. ఇప్పుడే కాదు వకీల్ సాబ్ సినిమానే నాగ వంశ, బాలయ్యతో చెయ్యాలి అనుకున్నాడు కానీ బాలయ్యనే అది పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఇప్పుడు మరి నాగ వంశీ, బాలయ్యతో ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు? దాన్ని ఎవరు డైరెక్ట్ చెయ్యబోతున్నారు? బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుందా అనే విషయాలు జూన్ 10న క్లియర్ అవ్వనున్నాయి.

Show comments