ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురములో”. బన్నీ ఈ సినిమాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతేనా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 2019లో విడుదలైన టాలీవుడ్ టాప్ చిత్రాల్లో ముందు వరుసలో నిలిచింది “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చి, హిట్ అయిన హ్యాట్రిక్ మూవీగా మరో రికార్డును క్రియేట్ చేసింది. “అల వైకుంఠపురములో” సినిమాకు చినబాబు నిర్మాతగా వ్యవహరించగా, తమన్ అందించిన సంగీతం దేశవ్యాప్తంగా మార్మ్రోగిపోయింది. ఈ సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతోంది.
Read Also : చైతో ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసిన సామ్… ఏకంగా 85 !
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రముఖ నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. ఆయన, త్రివిక్రమ్, అల్లు అర్జున్ అలాగే తమన్ కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేసి ఒక సర్‌ప్రైజ్ అనౌన్సమెంట్ ను త్వరలోనే అందిస్తున్నట్టు గా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ కాంబో నుంచి ఓ బిగ్ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో అనౌన్స్ అవ్వబోతున్నట్టుగా అర్ధం చేసుకోవచ్చు. మరి మహేష్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.
