Producer MN Kumar Complaint On Kiccha Sudeep: కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఈగ’తో తెలుగుతెరకు పరిచయమైన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా నటుడిగా ఎదిగాడు. పరభాష సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే.. కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలాంటి సుదీప్‌పై ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. ఎమ్ఎన్ కుమార్ అనే కన్నడ నిర్మాత.. సుదీప్ తనను దారుణంగా మోసం చేశాడంటూ ఆయన కుండబద్దలు కొట్టాడు. తన బ్యానర్‌లో సినిమా చేస్తానని పారితోషికం తీసుకొని, ఇప్పుడు మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన పేర్కొన్నాడు.
Ban Phones In Classroom: క్లాస్ రూముల్లో మొబైల్స్ నిషేధం.. యూరోపియన్ దేశం కీలక నిర్ణయం
గతంలో తాను ఒక ప్రాజెక్ట్ కోసం సుదీప్‌కు రూ.9 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చానని ఎమ్ఎన్ కుమార్ తెలిపాడు. కానీ, డేట్స్ ఇవ్వకుండా అతడు తిప్పుకుంటున్నాడని నిర్మాత ఆరోపించాడు. కేవలం రూ.9 కోట్లే కాదు.. తన వంటగది రెనోవేషన్ కోసం సుదీప్ మరో రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని చెప్పాడు. ఎనిమిదేళ్ల క్రితమే తమ మధ్య ఓ సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని.. కానీ ఇప్పటివరకు అతడు డేట్స్ ఇవ్వడంలో విఫలమయ్యాడని వెల్లడించాడు. సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కి కూడా అడ్వాన్స్ చెల్లించానని, ఈ చిత్రానికి ‘ముత్తట్టి సత్యరాజు’ అనే టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేశామని చెప్పుకొచ్చాడు. కానీ.. సంవత్సరాలు గడుస్తున్నా.. సుదీప్ తమ బ్యానర్‌లో సినిమా చేయకుండా, ఇతర నిర్మాతలతో సినిమాలు చేస్తున్నాడని ఆయన వాపోయాడు.
Russia: మాస్కోపై డ్రోన్ అటాక్.. అమెరికా, నాటో పనే అని రష్యా ఆరోపణలు..
తాను సుదీప్‌ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదని నిర్మాత ఎమ్ఎన్ కుమార్ తెలిపాడు. లేటెస్ట్‌గా ఆయన మరో నిర్మాతతో సినిమా ప్రకటించారని.. దీంతో తనకు మరో దారి లేక ఈ సమస్యను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ ముందుకు తీసుకెళ్లానని అన్నాడు. సుదీప్ మాట్లాడటానికి ముందుకు వస్తే.. ఈ సమస్యని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నిర్మాత పేర్కొన్నాడు. మరి, ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. కాగా.. సుదీప్ తాజాగా కలైపులి ఎస్ థాను నిర్మాణంలో ‘కిచ్చా46’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి టీజర్‌ని సైతం రిలీజ్ చేశారు.