NTV Telugu Site icon

Hero Ajith: అజిత్ మోసగాడు, నా డబ్బులు తిరిగివ్వలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Ajith Fraud Says Producer

Ajith Fraud Says Producer

Producer Manickam Narayanan Accuses Ajith Kumar of Cheating: హీరో అజిత్‌కుమార్ ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్‌గా ఉంటాడని అంటుంటారు. కానీ.. అందరూ అనుకునేలా అజిత్ అలాంటివాడు కాదంటూ నిర్మాత మాణికం నారాయణన్ కుండబద్దలు కొట్టారు. అతడు ఒక మోసగాడు అని, తన వద్ద డబ్బులు తీసుకొని ఇంతవరకూ తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఓ స్థానిక మీడియాతో నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని, కొన్ని సంవత్సరాల క్రితం అజిత్ నా నుంచి డబ్బులు తీసుకున్నాడు. అప్పట్లో అతను నా కోసం ఒక సినిమా చేస్తానని, రెమ్యునరేషన్‌లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని అతడు మాటిచ్చాడు. అయితే.. ఇప్పటివరకూ అతను నా డబ్బుని తిరిగి ఇవ్వకపోగా.. నా నిర్మాణంలో సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడు’’ అంటూ మండిపడ్డారు.

Balakrishna: లేడీ ఫ్యాన్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన బాలయ్య..

అజిత్ తనను తాను పెద్దమనిషిగా అనుకుంటాడని, కానీ అది వాస్తవం కాదని నిర్మాత మాణికం పేర్కొన్నారు. ఇప్పుడు అజిత్ ఒక స్టార్ హీరోగా ఎదిగాడని, ఒక్కో సినిమాకు రూ.50 కోట్లపైగానే సంపాదిస్తున్నాడని చెప్పారు. అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు, తన డబ్బు తనకు తిరిగి చెల్లించవచ్చు కదా అని నిలదీశారు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు సైతం.. అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామన్నారు. అతడు ఏనాడూ నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకోవడానికి ముందుకు రాలేదన్నారు. కాగా.. నిర్మాత మాణికం ఇలా అజిత్‌తో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన అజిత్‌కు 1996లో రూ.6 లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానన్నారు. ఆ అంశాలను సైతం తాజాగా మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు.. అజిత్ ఫ్యాన్స్ ఈ నిర్మాత మాటల్ని తోసిపుచ్చుతున్నారు. కేవలం తన కూతురి పెళ్లికి రాలేదన్న అక్కసుతోనే, ఆ నిర్మాత అజిత్‌పై ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ తెలుపుతున్నారు.

Wife: జాబ్ కోసం కష్టపడుతున్న భర్తలు.. రాగానే వదిలేస్తున్న భార్యలు

Show comments