Site icon NTV Telugu

టాలీవుడ్ లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి

producer jakkula nageswararao

producer jakkula nageswararao

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిర్మాత మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. వరుసగా శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఇప్పుడు జక్కుల నాగేశ్వరరావు మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటును మిగులుస్తున్నాయని టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version