Bunny Vas: సెప్టెంబర్ నుంచి ‘పుష్ప2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంపిణీదారునిగా కెరియర్ మొదలుపెట్టి ‘100% లవ్’ సినిమాతో నిర్మాతగా మారి వరుసగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు బన్నీవాస్. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా బన్నీ వాస్ నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ జూలై 1న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా విశేషాలతో పాటు తమ తదుపరి సినిమాల వివరాలను పుట్టినరోజు సందర్బంగా మీడియాతో పంచుకున్నారు. ఎంత సంపాదించాం అన్నది పక్కన పెడితే ప్రేక్షకులను థియేటర్లకు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ముఖ్యమైన విషయం. అందుకోసమే ‘పక్కా కమర్షియల్’ సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ ఉండాలని పంపిణీదారులను కోరాం. అందరూ సహకరిస్తామని చెప్పారు.
2002 లో చిత్రపరిశ్రమకు వచ్చాను, నిర్మాతగా 2011 లో తొలి సినిమా చేసా. ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. థియేటర్లలో సినిమా ఆడాలంటే అద్భుతమైన కంటెంట్ ఉండాలి. గతంలోలా సాధారణమైన కంటెంట్ తో సినిమాలు తీయలేము.
పాండమిక్ తర్వాత ప్రతిఒక్కరూ తమని తాము కరెక్ట్ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు తలపెట్టిన సినిమాలు కావటం వల్లె ఇప్పుడు అంతగా ప్రజాదరణ పొందలేకపోతున్నాయి. మా సంస్థలో కూడా ఇటీవల విడుదలైన సినిమాలు కొన్ని నిరాశపరచటానికి కారణం అదే. అయితే ‘పక్కా కమర్షియల్’ మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఇది పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ తో కూడినది. వినోదాత్మక సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ దగ్గర పేయింగ్ ఎలిమెంట్స్ గానే ఉంటాయి. దర్శకుడు మారుతి కూడా సినిమాను కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. సో అందరం ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ తో తీస్తున్న ’18 పేజెస్’ను సెప్టెంబర్ లో విడుదల చేస్తాం. ఆ తరువాత చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉంటాయి. వీటితో పాటు శిరీశ్ నటించిన సినిమా కూడా ఉంటుంది.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ఇక బన్నీ నటిస్తున్న ‘పుప్స2’ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ లపై కూడా డిష్కషన్స్ నడుస్తున్నాయి. ‘పుష్ప2’ షూటింగ్ మొదలు కాగానే బన్నీ ఇతర సినిమాలపై కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు అన్ని వివరాలు తెలియచేస్తాం అంటున్నారు బన్నీ వాసు. ఓటీటీ లో సినిమాల విడుదలకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రెండు నెలల గ్యాప్ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినీపెద్దలు కూడా ఈ విషయమై కసరత్తు చేస్తున్నారని వివరించాడు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!