Site icon NTV Telugu

Bunny Vas: సెప్టెంబర్ నుంచి ‘పుష్ప2’

Bunny Vas

Bunny Vas

పంపిణీదారునిగా కెరియర్ మొదలుపెట్టి ‘100% లవ్’ సినిమాతో నిర్మాతగా మారి వరుసగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు బన్నీవాస్. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా బన్నీ వాస్ నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ జూలై 1న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా విశేషాలతో పాటు తమ తదుపరి సినిమాల వివరాలను పుట్టినరోజు సందర్బంగా మీడియాతో పంచుకున్నారు. ఎంత సంపాదించాం అన్నది పక్కన పెడితే ప్రేక్షకులను థియేటర్లకు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ముఖ్యమైన విషయం. అందుకోసమే ‘పక్కా కమర్షియల్’ సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ ఉండాలని పంపిణీదారులను కోరాం. అందరూ సహకరిస్తామని చెప్పారు.
2002 లో చిత్రపరిశ్రమకు వచ్చాను, నిర్మాతగా 2011 లో తొలి సినిమా చేసా. ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. థియేటర్లలో సినిమా ఆడాలంటే అద్భుతమైన కంటెంట్ ఉండాలి. గతంలోలా సాధారణమైన కంటెంట్ తో సినిమాలు తీయలేము.

పాండమిక్ తర్వాత ప్రతిఒక్కరూ తమని తాము కరెక్ట్ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు తలపెట్టిన సినిమాలు కావటం వల్లె ఇప్పుడు అంతగా ప్రజాదరణ పొందలేకపోతున్నాయి. మా సంస్థలో కూడా ఇటీవల విడుదలైన సినిమాలు కొన్ని నిరాశపరచటానికి కారణం అదే. అయితే ‘పక్కా కమర్షియల్’ మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఇది పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ తో కూడినది. వినోదాత్మక సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ దగ్గర పేయింగ్ ఎలిమెంట్స్ గానే ఉంటాయి. దర్శకుడు మారుతి కూడా సినిమాను కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. సో అందరం ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ తో తీస్తున్న ’18 పేజెస్’ను సెప్టెంబర్ లో విడుదల చేస్తాం. ఆ తరువాత చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉంటాయి. వీటితో పాటు శిరీశ్ నటించిన సినిమా కూడా ఉంటుంది.

ఇక బన్నీ నటిస్తున్న ‘పుప్స2’ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్‌ లపై కూడా డిష్కషన్స్ నడుస్తున్నాయి. ‘పుష్ప2’ షూటింగ్ మొదలు కాగానే బన్నీ ఇతర సినిమాలపై కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు అన్ని వివరాలు తెలియచేస్తాం అంటున్నారు బన్నీ వాసు. ఓటీటీ లో సినిమాల విడుదలకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రెండు నెలల గ్యాప్ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినీపెద్దలు కూడా ఈ విషయమై కసరత్తు చేస్తున్నారని వివరించాడు.

Exit mobile version