Site icon NTV Telugu

Bellamkonda Suresh : చీటింగ్ కేసుపై రియాక్షన్… నిర్మాత వార్నింగ్

Bellamkonda-Suresh

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ “85 లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. నా పిల్లలు నా పంచ ప్రాణాలు… అతను నా పిల్లలు జోలికి వచ్చాడు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటాను. అతని పై పరువు నష్టం దావా వేస్తాను… ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి” అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : Cheating Case: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అతని తండ్రిపై కేసు నమోదు.. నమ్మించి మోసం చేశారంటూ

బెల్లంకొండ సురేష్ పై శరణ్ అనే వ్యక్తి చీటింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరమని 2018లో మొదట 50 లక్షలు అప్పుగా తీసుకున్న బెల్లంకొండ సురేష్, తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోయే సినిమాలో పార్ట్‌నర్‌ ను చేస్తానంటూ నమ్మించి సుమారు 26 లక్షల పైగా తీసుకున్నాడని, ఇలా మొత్తం రూ.85లక్షలు తీసుకుని, తనను మోసం చేశారని నిర్మాత బెల్లకొండపై ఆరోపణలు చేశాడు సదరు వ్యక్తి.

తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా, అటు సినిమా ప్రొడక్షన్ లో పార్ట్‌నర్ షిప్ కూడా ఇవ్వక పోవడంతో కోర్టును ఆశ్రయించాడు శరణ్. కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసీ సెక్షన్స్ 406, 417, 420, 120 రెడ్‌ విత్ 156 ఆఫ్ 3 తదితర సెక్షన్ల కింద బెల్లంకొండ సురేష్ పై కేసును నమోదయ్యాయి.

Exit mobile version