Site icon NTV Telugu

Producer Bekkem Venugopal: 3 నుంచి ‘అల్లూరి’ యాత్ర

Alluri

Alluri

శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్ ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియాపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పకురాలు. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత విలేకరులతో సమావేశం అయ్యారు. సెప్టెంబర్ 3 నుండి అల్లూరి యూనిట్ యాత్రని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ‘నా 15 ఏళ్ళ ప్రయాణంలో ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ప్రాధన్యత ఇచ్చాను. మంచి కంటెంట్ తో యాక్షన్ సినిమా తీయాలని వుండేది. అపుడే ప్రదీప్ వర్మ ‘అల్లూరి’ కథ చెప్పారు. ‘అల్లూరి’ పేరు వింటేనే ఒక పవర్ వస్తుంది. అంతే పవర్ ఫుల్ స్టొరీ ఇది. సినిమాపై వున్న ప్రేమ గౌరవంతో పోలీస్ డ్రెస్ తో వచ్చాను. షూటింగ్ నిన్నటితో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలోఉంది. పాటలు వరుసగా విడుదల చేసి పదిరోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం. సెప్టెంబర్ 3న వైజాగ్ లో అల్లూరి సీతారామారాజు సమాధి దగ్గర నుండి హీరోతో పాటు యూనిట్ అంతా కలసి యాత్రని ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో టూర్ చేసి పోలీసులు అధికారులకు సన్మానం చేస్తూ పబ్లిక్ ని కలుస్తూ 12 రోజుల పాటు టూర్ ప్లాన్ చేశాం. ఈ టూర్ వరంగల్ నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. టూర్ ముగిసిన తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సినిమాని గ్రాండ్ విడుదల చేస్తాం. శ్రీవిష్ణు ‘అల్లూరి’ లో చాలా ఇంటెన్స్ గా చేశాడు. చాలా కష్టపడ్డాడు. తన కెరీర్ లో అల్లూరి బెస్ట్ మూవీ అవుతుంది’ అని తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు వేణుగోపాల్. చాలా పోలీస్ కథలు వచ్చినా అల్లూరిలో వుండే వైవిధ్యం గురించి వివరిస్తూ ‘ఒక పోలీస్ జీవిత ప్రయాణం చూపిస్తున్నాం. వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగా వుంటుంది. ఎమోషనల్ డ్రైవ్ వుంటుంది. సినిమా పూర్తయ్యేసరికి పోలీస్ వృత్తిపై ఎనలేని గౌరవం ఏర్పడుతుంది’ అని బదులిచ్చారు. ‘సినిమా చూపిస్తా మామా, నేను లోకల్’లా పెద్ద కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈ సినిమా తర్వాత ‘బూట్ కట్ బాలరాజు’ అనే లోబడ్జెట్ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలియచేశారు బెక్కం వేణుగోపాల్.

Exit mobile version