Site icon NTV Telugu

బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటారు. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేయడంలో బండ్ల గణేష్ చాలా ఉత్సహాంగా ఉంటారు. అయితే తాజాగా బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగించబోతున్నట్లు తెలిపారు. ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు స్పష్టం చేశారు. నో కాంట్రవర్సీస్.. నా లైఫ్ లో అలాంటి వాటికి చోటు లేదు అంటూ ట్విట్టర్ వేదికగా బండ్ల పేర్కొన్నారు.

Exit mobile version