NTV Telugu Site icon

Breaking: హాస్పిటల్‌లో చేరిన బండ్ల గణేష్.. చేతికి సెలైన్?

Bandla Ganesh Hospitalised

Bandla Ganesh Hospitalised

Producer Bandla Ganesh hospitalized: ఒకప్పటి కమెడియన్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్తమాన రాజకీయ, సామాజిక అంశాల మీద తనకు తోచిన విధంగా స్పందిస్తూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కూడా ఆశించిన బండ్ల గణేష్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో పరాజయం పాలైన తర్వాత సైలెంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినా సరే ప్రస్తుతానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. ఒకపక్క పవన్ కి వీరభక్తుడిని అని చెప్పుకుంటూ నే సోషల్ మీడియాలో ఆయన మీద ఎవరైనా కామెంట్ చేస్తే వారికి కౌంటర్ ఇస్తూ ఉంటారు బండ్ల గణేష్.

Vijay Sethupathi: ‘మహారాజా”గా వస్తున్న ఉప్పెన విలన్..

ఈ సంగతులు పక్కన పెడితే తాజాగా బండ్ల గణేష్ హాస్పిటల్లో బెడ్ పై చేతికి సిలైన్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఆయనకేం జరిగిందనే విషయం మీద క్లారిటీ లేకపోయినా ఆయన వైరల్ ఫీవర్ తో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారని అంటున్నారు. అయితే ఈ విషయం మీద బండ్ల గణేష్ స్పందించాల్సి ఉంది. అసలు బండ్ల గణేష్ కి ఏమైంది? ఎందుకు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు? అంటూ నెటిజన్లు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయం మీద బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక సినిమాలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ ఒక సినిమా అనౌన్స్ చేశారు కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.