NTV Telugu Site icon

Producer Arrested: మత్తు మందిచ్చి రేప్.. కడుపు తీయించిన సినీ నిర్మాత అరెస్టు

Producer Arrested

Producer Arrested

Producer Arrested for Rape Charges: మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక అంశం అనునిత్యం తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఒక యువతిపై కూల్ డ్రింకులో మత్తు మందు మాత్రలు వేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమె పిండాన్ని
తొలగించిన సినీ నిర్మాత అరెస్టు చేసి జైలు పాలయ్యాడు. చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన సినిమా నిర్మాత మహమ్మద్ అలీ (30) కిల్ అయనంబాక్కంలో సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. కొరటూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి గతేడాది సెప్టెంబర్‌లో మహమ్మద్ అలీ కార్యాలయంలో చేరింది. ఈ క్రమంలో గత మే 13న ఆ యువతి అంబత్తూరు ఆల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసింది. అందులో సినిమా నిర్మాణ సంస్థ నడుపుతున్న మహ్మద్ అలీ తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి పెట్టి నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడని పేర్కొంది.

Fire Accident :హైదరాబాద్ మూసారాంబాగ్‌ లో భారీ అగ్ని ప్రమాదం

నాకు తెలియకుండా సాఫ్ట్ డ్రింక్స్ లో మత్తు మాత్రలు కలిపి నాపై అత్యాచారం చేశాడు, అంతే కాకుండా దాన్ని వీడియోగా కూడా రికార్డ్ చేశాడు. దీంతో నేను గర్భం దాల్చడంతో పౌష్టికాహార మాత్రలంటూ అబార్షన్ మాత్రలు కొని ఇచ్చి కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించాడు. ఈ వ్యవహారం గురించి చెబితే చంపేస్తానని బెదిరించాడు. నన్ను అన్ని విషయాల్లో దోపిడీ చేస్తునందు. అందువల్ల అతడిని అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు విచారణ జరపగా ఆ ఆరోపణ నిజమే అని రుజువైంది. అనంతరం చిత్ర నిర్మాత మహమ్మద్ అలీపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం అంబత్తూరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Show comments