ప్రస్తుతం టాలీవుడ్ లో జీవితా రాజశేఖర్ చీటింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ‘గరుడ వేగ’ నిర్మాత, జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కోటేశ్వర రాజు జీవితా పై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే. తమ వద్ద రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆయన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసుపై జీవిత స్పందిస్తూ.. మేము ఎవరికి భయపడమని, కోర్టులోనే చూసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా తమపై కేసు పుట్టినవాళ్ళు కూడా ఉత్తములు కాదని, మా పరువు తీయడానికే వారు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా.. మరోసారి నిర్మాత కోటేశ్వర రాజు ప్రెస్ మీట్ పెట్టి జీవితా రాజశేఖర్ మోసాలను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత మాట్లాడుతూ ” జీవిత మాపి చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యం. నేను ఒక్కడినే కాదు చాలా మంది నిర్మాతలను జీవిత ట్రాప్ చేసి డబ్బులు గుంజుతుంది. కానీ, మేము అలా కాదు.. మేము లండన్ నుండి వచ్చాం.. ఆమె ట్రాప్ లో పడబోము.. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే టైపు మాది.. జీవిత, ఆమె మామ వరదరాజన్ మా ఇంటికి వచ్చి డబ్బు కావాలని అడిగారు. జీవిత మా కాళ్లు పట్టుకొని అడిగింది. వరద రాజన్.. ఆమె కాళ్ళు పట్టుకున్నది అని కాదు కానీ నా ముఖం చూసి ఇవ్వండి అని చెప్తే అప్పుడు డబ్బు ఇచ్చాం. ఆ సమయంలో వరద రాజన్ కూడా కోడలు గురించి బాధపడ్డాడు. రాజశేఖర్ కు డబ్బు అవసరంలేదని.. అతని భార్య జీవితకు డబ్బు అవసరం ఉందనని.. సినిమా ముసుగులోఎంతోమంది వద్ద అప్పు చేసిందని తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె మమ్మల్ని ఇరికించాలని చూస్తుంది.. కానీ మమ్మల్ని ఇరికించడం ఆమె తరం కాదు.
డబ్బు తీసుకున్న రోజు మేము, రాజశేఖర్ కు దేవుళ్లుగా కనిపించాం. ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాం కనుక అలా కనిపించడం లేదా..?. మీ బుద్దులు ఎవరికి తెలియవు.. జీవిత వెళ్లి మీడియా ముందు చిలకపలుకులు పలికితే ఎవరు నమ్మరు.. రాజశేఖర్ యాక్సిడెంట్లు చేయడం, దాన్నీ ఆమె కవర్ చేయడం ఎవరికి తెలియవు వారి బాగోతాలు.. ఇక ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ తో సినిమా తీసేవాళ్లు లేరు.. సినిమా విడుదలైతే చూసేవాళ్లు ఎవరూ లేరు.. సినిమా ఓపెనింగ్ టికెట్లు కూడా వచ్చేదీ లేదు.. అది నేను ఖచ్చితంగా చెప్తాను.. అసారే ఆమె అన్నట్లే కోర్టులోనే తేల్చుకుంటాం .. మీడియా ముందు చెప్పిన ముచ్చట్లు కోర్టు లో చెప్పమనండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
