Priyanka Upendra Ugravatharam Telugu Trailer Released: ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘ఉగ్రావతారం’. ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో ‘ఉగ్రావతారం’ తెరకెక్కింది. ఈ సినిమాలో సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి సందడి చేశారు. కరాటే రాజు, సత్య ప్రకాష్ చేతుల మీదుగా పాటను విడుదల చేయించగా రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!
ఈ క్రమంలో ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘నాకు హైద్రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్రని ఫస్ట్ టైం ఇక్కడే కలిశా, హైద్రాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది.నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండని అన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ పరిశీలిస్తే ప్రియాంక ఉపేంద్ర పోలీస్ అధికారిణిగా కనిపించింది. రేప్ కేసులను డీల్ చేయడంలో ఆమెను స్పెషలిస్ట్ గా చూపారు. ఇక అమ్మాయిలను వేధించేవారి పట్ల ఆమె సింహ స్వప్నంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్క లుక్ వేసేయండి మరి.