Site icon NTV Telugu

Priyanka Jawalkar: వెంకటేశ్‌తో డేటింగ్‌పై ఫుల్ క్లారిటీ

Priyanka Clarity On Affair

Priyanka Clarity On Affair

కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసిన ఒక ఫోటోకు ‘క్యూట్’ అంటూ క్రికెటర్ వెంకటేశ్ అయ్యార్ కామెంట్ పెట్టాడు. అంతే, అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఆ రూమర్స్‌ని వాళ్లు ఖండించకపోవడంతో.. అవి మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రియాంక షేర్ చేసిన ఒక ఫోటో.. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.

అయితే.. ఆ ఫోటోలో ఉన్న సదరు వ్యక్తి ఫేస్ కనిపించడం లేదు. అతను అటువైపుకి కూర్చున్నాడు. ప్రియాంక అతనితో మాట్లాడుతున్నట్టు ఆ ఫోటోలో కనిపించింది. అంతేకాదు.. లవ్ సింబల్ ఉన్న ఎమోజీని షేర్ చేస్తూ, హిమ్ అనే క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది, ఆ ఫోటోలో ఉన్నది పక్కాగా వెంకటేశ్ అయ్యరేనని, లవ్ సింబల్ ఓపెన్‌గానే పెట్టేసింది కాబట్టి వాళ్లు కచ్ఛితంగా ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. ఈ వార్తలు కూడా వెంటనే వైరల్ అయిపోయింది. ప్రియాంక తన ప్రేమను అఫీషియల్‌గానే కన్ఫమ్ చేసిందన్న పుకార్లు జోరుగా చక్కర్లు కొట్టేశాయి.

అలా చక్కర్లు కొడుతూ తనదాకా వార్తలు చేరడంతో, ఫైనల్‌గా ప్రియాంక రియాక్ట్ అయ్యింది. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తమకు ఫోటోషూట్ కోసం సహాయం చేసేందుకు వచ్చాడని, అంతే తప్ప తన బాయ్‌ఫ్రెండ్ కాదని పేర్కొంది. తాను ప్రేమలో ఉన్నానన్న వార్తలు వైరల్ అవ్వడంతో తన తల్లి ‘ఏంటి విషయంఫ’ అని ప్రశ్నించిందని తెలిపింది. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దని ప్రియాంక వేడుకుంది.

Exit mobile version