Site icon NTV Telugu

Citadel: సిటాడెల్ కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు.. అమెజాన్ సీఈవో ఏమన్నాడంటే.. ?

Amzon

Amzon

Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా గత తొమ్మిది నెలల్లో దాదాపు 10 కాస్ట్లీ సిరీస్ లను అమెజాన్ అందుబాటులోకి తీసుకురాగా.. అందులో ఆరు భారీ పరాజయాలను అందుకొని కోట్ల కొద్దీ నష్టాలను తీసుకొచ్చిపెట్టాయి. అందులో ప్రియాంక చోప్రా నటించిన సిటాడిల్ ఒకటి. ఇక ఈ సిటాడిల్ ప్లాప్ విషయమై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ వెబ్ సిరీస్ నిర్మించడానికి అమెజాన్ సుమారు 2000 కోట్లు వెచ్చించిందని, సృజనాత్మకతలో మార్పు కారణంగా మరో రూ 80 కోట్లు పెట్టిందని ఆయన వివరించాడు. అయితే ఈ సిరీస్ ఎందుకని జనాధారణ పొందలేకపోయిందో తెలియలేదని ఆయన తెలిపాడు.

Dalapathi Vijay : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న విజయ్?

తాము నిర్మిస్తున్న భారీ క్రేజీ వెబ్ సిరీస్ లు, షోల కు అతి భారీ పెట్టుబడులు పెట్టాల్సివస్తోంది. చివరికి దాని ఫలితం ఎలా ఉన్నా కూడా డబ్బులు మేమే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ముందు ముందు ఇలాంటివి రీపీట్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపాడు. కేవలం సిటాడెల్ మాత్రమే కాదు.. డైసీ జోన్స్ & ది సిక్స్ – ది పవర్ – డెడ్ రింగర్స్ – ది పెరిఫెరల్ వంటి ఇతర ప్రదర్శనల కోసం ఒక్కోదానికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టమని, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అయితే ఏకంగా రూ. 4000 వేళా కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆయన తెలిపాడు. అంత డబ్బు ఖర్చుపెట్టినా ప్రేక్షకులు ఆదరించకపోవడానికి గలకారణం కథ అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు అమెజాన్ నుంచి ఎలాంటి సిరీస్ లు రానున్నాయో చూడాలి.

Exit mobile version