NTV Telugu Site icon

Priyanka Chopra: బెడ్ సీన్స్ .. ఆ పార్ట్స్ కనిపించకుండా చేతులను అడ్డుపెట్టి

Priyanka

Priyanka

Priyanka Chopra: అమెరికా కోడలు ప్రియాంక చోప్రా ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రిచర్డ్ మాడాన్, ప్రియాంక జంటగా రస్సో బ్రదర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక అమెజాన్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, రిచర్డ్ మాడాన్, ప్రియాంక మధ్య బెడ్ సీన్స్ గురించే చర్చ జరుగుతోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఏప్రిల్ 28 న అమెజాన్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంకకు బెడ్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Chiranjeevi: జగదేకవీరుడు- అతిలోక సుందరి సీక్వెల్ అయితే కాదుగా..?

పెళ్లి తరువాత ఇలాంటి బెడ్ సీన్స్ చేయాలంటే గట్స్ కావాలి. అందులో ప్రియాంక అంటే .. ఎన్నో ట్రోల్స్ వస్తాయి. వాటిని పట్టించుకోకుండా ఎలా ఇవన్నీ చేశారు అన్న ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెప్తూ.. ” నేను, రిచర్డ్ బెడ్ సీన్స్ లో చాలా ఇబ్బంది పడ్డాం. బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు ఒకరినొకరు సపోర్ట్ గా నిలిచాం. ఇక మరీ ఘాటు సన్నివేశాలు, కొన్ని యాంగిల్స్ లో అయితే చాలా ఇబ్బంది పడ్డాం. కెమెరా ముందు మా బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకొనేవాళ్ళం. రిచర్డ్ అయితే.. అక్కడ చేతులతో కవర్ చెయ్.. ఇక్కడ బాడీ కనిపిస్తుంది కవర్ చెయ్ అంటూ చెప్పుకొచ్చేవాడు. ఇలా ఇద్దరం సన్నిహితంగా ఉండడం వలన ఆ సీన్స్ ను పూర్తి చేశాం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments