Site icon NTV Telugu

నిక్ కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్

Priyanka Chopra gave 'Sweet' surprise to Nick Jonas

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ల అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వారి సోషల్ మీడియా అకౌంట్ ను చూస్తే సరిపోతుంది. తరచుగా వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం లండన్‌లో “సిటాడెల్” షూటింగ్‌లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. అక్కడ నిక్ జోనాస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనస్ లతో కలిసి ఆసక్తికరమైన పర్యటనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. నిక్ జోనస్ తన కాన్సర్ట్ కు ముందు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిక్ జోనస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రుచికరమైన కేక్ చిత్రాన్ని పంచుకున్నారు. దీనితో అతను తన భార్యను ఎంతగా మిస్ అయ్యాడని తెలిపాడు. అంతేకాదు ఆమె తనతోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. నిక్ జోనస్ ఈ పిక్ ను పోస్ట్ చేస్తూ ‘థాంక్స్ ప్రియాంక చోప్రా, యూ ఆర్ ది బెస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇటీవల నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా కొన్ని ఫ్యాన్ పేజీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కన్పించారు. ఆ తరువాత ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌ని చెంపపై ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ కాకుండా ‘టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ లో కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రియాంక చోప్రా… కత్రినా కైఫ్, అలియా భట్‌తో కలిసి ‘జీ లే జరా’ చిత్రంలో కనిపించనుంది. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version