NTV Telugu Site icon

Priyanka Chopra: ప్రియాంకా!… ఏమిటిది?

Priyanka Chopra

Priyanka Chopra

వెబ్ సిరీస్ అనగానే అశ్లీల, అసభ్య సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయని అందరికీ తెలుసు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే తాము ఇలాంటి సీన్స్ పెడుతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి సిరీస్ లో నటించిన కొందరు స్టార్స్ వీటిని ఏకాంతంలో చూడండనీ సెలవిస్తున్నారు. ఇలా వెబ్ సిరీస్ లో నటించేవారికి సైతం అందులోని కంటెంట్ గురించి తెలుసు. కానీ, తప్పదు యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్ రూపొందుతున్నాయి. ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ సిరీస్ లోనూ ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయిట. అందునా పెళ్ళయి ఒక బిడ్డకు తల్లయిన ప్రియాంక చోప్రా నగ్నంగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రేక్షకులకు విశేషమే మరి. ‘సిటాడెల్’ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా, ఆమె సరసన హీరోగా నటించిన రిచర్డ్ మ్యాడెన్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా సైతం మిగతా ప్రశ్నలు గాలికి వదిలేసి, శృంగార సన్నివేశాల్లో ఎలా నటించారు? అంటూ ప్రశ్నలు కురిపించారు.

అందుకు ప్రియాంక సిగ్గుల మొగ్గయింది. ఆమె పరిస్థితి చూసిన రిచర్డ్ సైతం ఇబ్బంది పడ్డాడు. స్క్రిప్ట్ దశ నుండి ఒకరితో ఒకరం స్నేహంగా ఉండడం వల్ల, యాక్షన్ సీన్స్ కోసం రోజూ ప్రాక్టీస్ చేసిన కారణంగా తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, అందువల్ల శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడూ ప్రొఫెషనల్స్ గానే వ్యవహరించామని ప్రియాంక, రిచర్డ్ చెప్పారు. ఈ సీన్స్ లో లిప్ లాక్స్ ఉన్నాయా? అన్నది మరో జర్నలిస్ట్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, త్వరలోనే రానున్న ‘సిటాడెల్’ చూస్తే మీకే అర్థమవుతుంది కదా అంటూ రిచర్డ్ దాటవేశాడు. ఏది ఏమైనా ఈ ప్రశ్నలు అడిగించుకోవడం కూడా ‘సిటాడెల్’కు క్రేజ్ తీసుకు రావడానికే అనీ కొందరు అంటున్నారు.