టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసారు.
Also Read : Pushpa -2 : నేటి నుంచి థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్ వెర్షన్
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ పై శ్రద్ద పెట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమాలో మహేశ్ తో పాటు మలయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ లో పెరిగి హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రాను తీసుకున్నారని టాక్ కూడా వినిపించింది. తాజగా ఈ హాట్ భామ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమివ్వడంతో ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ అని సొషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా నటిస్తున్న మాట వాస్తవమే.. కానీ హీరోయిన్ గా కాదు ఈ సినిమాలో ఓ ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ ఉందట ఆ పాత్ర కోసం మాత్రేమే తీసుకున్నారట. అందుకోసం లుక్ టెస్ట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిందట ప్రియాంక చోప్ర. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకుంటారని యూనిట్ వర్గాలు తెలిపాయి.