Priyanka Chopra: అమెరికా కోడలు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిక్ జోనాస్ ను వివాహమాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ మధ్యనే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అంతాగా విజయాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం బాగానే పేరు వచ్చింది. ముఖ్యంగా పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పించి ఔరా అనిపించింది. ఇక ఏ హీరోయిన్ అయినా కెరీర్ మొదట్లో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోక తప్పదు. వాటిని ఆ హీరోయిన్ స్టార్ అయ్యాకా.. మీడియా ముందు చెప్పడం సాధారణమే. తాజాగా ప్రియాంక కూడా ఓకే ఇంటర్వ్యూలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది. తనను కూడా డైరెక్టర్లు వేధించారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక సినిమాను వదిలేసినట్లు తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
Tiger Nageswara Rao: పులులని వేటాడే పులిని ఎప్పుడైనా చూసారా?
” 2002 లో నేను ఒక సినిమా ఒప్పుకున్నాను. అది ఒక యాక్షన్ ఫిల్మ్. దానికోసం చాలా కష్టపడ్డాను. అయితే ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉంటాయని డైరెక్టర్ చెప్పాడు. ఒక అండర్ కవర్ పురుషుడును తాను టెంప్ట్ చేయాలనీ, అందుకోసం లో దుస్తులు వేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఆ సన్నివేశం ముందు తాను చూడాలని కోరాడు. మొదట ఆ సన్నివేశం కోసం లేయర్ దుస్తులు ధరించాలని అనుకున్నాను. కానీ ఆ లేయర్ ఉండకుండా అండర్ వేర్ మాత్రమే ఉండాలని, అలానే ప్రేక్షకులకు చూపించాలని.. లేకపోతే ఏ ప్రేక్షకుడు సినిమా చూస్తాడు అని నా స్టైలిస్ట్ ముందు చెప్పాడట. ముందు ఆ అండర్ వేర్ సీన్ ను తన ముందు చేయాలనీ కోరాడట. అది విన్న నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఇతరుల తృప్తికోసం నన్ను సాధనంలా వాడుకోవడం ఏంటి అని వాపోయాను. అందుకే ఆ సినిమాను మధ్యలోనే ఆపేశాను. అప్పటివరకు నా షూటింగ్ కు అయిన ఖర్చు మొత్తం వెనక్కి ఇచ్చేశాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పీసీని ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.