NTV Telugu Site icon

Priyadarshi: పులులు-మగవాళ్లు అంతరించిపోతున్నారు…

Priyadarshi

Priyadarshi

బలగం సినిమాతో థియేటర్స్ లో మంచి హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి పాత్రలో అయినా నటించగల నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘సేవ్ ది టైగర్స్. టైటిల్ చూసి ఇదేదో అడ్వెంచర్ డ్రామా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనుకోకండి, ఇదో ఫక్తు కామెడీ సినిమా. ప్రియదర్శి, అభినవ్ గోమతం, చైతన్య కృష్ణ హీరోలుగా… జబర్దస్త్ సుజాత, దేవియాని, పావని గంగిరెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో గంగవ్వ స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. మగజాతి పడే ఇబ్బందులని, భార్య పెట్టే బాధలని భరిస్తూ ఉంటే పులుల్లా మగవాళ్లు కూడా అంతరించిపోతారు. మగవాళ్లని కాపాడుకోవాలి, మగజాతిని కాపాడుకోవాలి అనే ఫన్నీ కాన్సెప్ట్ తో ‘సేవ ది టైగర్స్’ సినిమా తెరకెక్కింది.

Read Also: Dasara: చిరు దెబ్బకి దసరా డైరెక్టర్ వీణ స్టెప్ వేస్తున్నాడు…

ఏప్రిల్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రతి సీన్ ఫన్ ని జనరేట్ చేసింది అనే చెప్పాలి. ఈ కామెడీ ఎంటర్టైనర్ ని ‘యాత్ర’ ఫేమ్ ‘మహి వి రాఘవ్’, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్ గా వ్యవహరించగా బాహుబలి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించిన తేజ కాకమాను దర్శకత్వం వహిస్తున్నాడు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కామెడీ సినిమాకి మంచి రీచ్ ఉండేది కానీ మేకర్స్ ఒటీటీ రిలీజ్ కే స్టిక్ అయ్యి ఉండడంతో ఈ సినిమా చూడాలి అనుకున్న వాళ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ని ఏప్రిల్ 27న ఓపెన్ చెయ్యాల్సిందే.