Site icon NTV Telugu

Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..

Premante

Premante

Premante Movie : యంగ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’. థ్రిల్‌ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్ లైన్. కొత్త డైరెక్టర్ నవనీత్‌ శ్రీరామ్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ ను రిలీజ్ చేశారు. లవ్‌, కామెడీతోపాటు థ్రిల్లింగ్‌ పాయింట్లతోనే మూవీని తీసినట్టు అర్థం అవుతోంది. మనకు తెలిసిందే కదా ప్రియదర్శి సినిమా అంటే ఈ మధ్య మంచి కంటెంట్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

Read Also : Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ కొత్త సినిమా స్టార్ట్

తాజాగా ట్రైలర్ కూడా ఫన్ అండ్ థ్రిల్ ను పంచేలా ఉంది. భార్య, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్లతో మూవీని ప్లాన్ చేశాడు. ఇందులో యాంకర్ సుమ కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. మొత్తంగా ఫన్ అండ్ థ్రిల్ ను పంచేలా మూవీని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కోర్ట్ సినిమా తర్వాత ప్రియదర్శికి ఆ స్థాయి హిట్ పడలేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్లాన్ తో ఉన్నాడు. తనకు కలిసొచ్చిన ఫన్ మోడ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మరి వర్కౌట్ అవుద్దా లేదా చూడాలి.

Read Also : Mythri Movie Makers : ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్ కాంబోలో కొత్త మూవీ స్టార్ట్

Exit mobile version