Site icon NTV Telugu

Priyadarshi : ఆ సినిమా చేయడం చెత్త నిర్ణయం.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్

Priyadarshi

Priyadarshi

Priyadarshi : ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నా కెరీర్ లో ఎన్నడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్ల లాగా యాక్టింగ్ చేద్దామని వచ్చాను.. ఇన్నేళ్ల కెరీర్ లో అలాంటి పాత్రలు నాకు ఇంకా రాలేదు. అందుకే చాలా అసంతృప్తిగా ఉంది’ అంటూ తెలిపారు.
Read Also : Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుంది : సంపూర్ణేష్‌ బాబు

‘నేను చాలా రోజులుగా కామెడీ సినిమాలు కాకుండా యాక్టింగ్ పరమైన పాత్రలు చేయాలని చూస్తున్నాను. కోర్టు సినిమా నేను నా లైఫ్‌ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం. మిఠాయి సినిమా చేయడం నా కెరీర్ లోనే చెత్త నిర్ణయం. ఇప్పుడిప్పుడే నాకు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిపై క్లారిటీ వస్తోంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక ఎత్తు. సారంగపాణి జాతకం నాకు కొత్త తరహా సినిమా. ఇలాంటి పాత్రలో ఇప్పటి వరకు నటించలేదు. ఇది అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు ప్రియదర్శి.

Exit mobile version